: పర్సనల్ మెసేజ్ లపై పదాల పరిమితులను తొలగించిన ట్విట్టర్


ట్విట్టర్ ఖాతాదారుల పర్సనల్ ట్వీట్లపై ఉన్న 140 అక్షరాల పరిమితిని తొలగించినట్టు ట్విట్టర్ వెల్లడించింది. గతంలో ట్వీట్ల అక్షరాల పరిమితిని ఎత్తివేసిన ట్విట్టర్, ఇప్పుడు వ్యక్తిగత మెసేజ్ లపైనా అవధులు తొలగించింది. దీంతో ఒక్క మెసేజ్ లోనే మొత్తం విషయాన్ని తెలియజేసే వీలు నెటిజన్లకు దగ్గరైందని ట్విట్టర్ ప్రొడక్ట్ మేనేజర్ సచిన్ అగర్వాల్ తన బ్లాగ్ లో వెల్లడించారు. ట్విట్టర్ తదుపరి అభివృద్ధి దిశలో ఈ అడుగు కీలకమైందని వివరించారు. ప్రస్తుతానికి పరిమితుల తొలగింపు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లకు అందుబాటులో ఉంటుందని, సమీప భవిష్యత్తులో మిగతా అన్ని సిస్టమ్స్ కూ అందుబాటులోకి తెస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News