: 'మన ఊరు- మన ప్రణాళిక'కే దిక్కులేదు... ఇక గ్రామజ్యోతి ఎందుకు?: కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ఒకదాని తరువాత ఒకటిగా తీసుకొస్తున్న పథకాలపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రోజుకో కొత్త పథకంతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన 'మన ఊరు- మన ప్రణాళిక'కే దిక్కులేదని, అలాంటిది ఇక గ్రామజ్యోతి ఎందుకంటూ ప్రశ్నించారు. ఇష్టం వచ్చిన పథకాలు ప్రవేశపెట్టి కొత్త పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టవద్దని కోమటిరెడ్డి కోరారు. తెలంగాణ ప్రజలు డెంగ్యూతో ఆసుపత్రుల పాలవుతున్నారని, ముందు ఈ సమస్యలు పరిష్కరించాలని ఆయన హితవు పలికారు.