: ముగిసిన పార్లమెంటు సమావేశాలు... నిరవధికంగా వాయిదా పడ్డ ఉభయ సభలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాలపై ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన జీఎస్ టీ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. సమావేశాల ముగింపు సందర్భంగా, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ మాట్లాడుతూ, ఈ సమావేశాల్లో మొత్తం 34 గంటల సమయం వృథా అయిందని చెప్పారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించరాదని తాను పలుమార్లు కోరినప్పటికీ... కొందరు సభ్యులు ప్లకార్డులతో వచ్చి సభను ఆటంకపరిచారని అన్నారు. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో అయినా ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆమె కోరారు.