: అవసరమైన చోట కరుణించని వరుణుడు...మాగాణమ్మ ఎదురుచూపులు!


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. అల్పపీడనం బలహీనపడి చత్తీస్ గఢ్ వైపుగా వెళ్లింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ, మాగాణి రైతాంగానికి లాభం లేకుండా పోతోంది. గడచిన నెలన్నర వ్యవధిలో సాధారణ వర్షపాతంకన్నా 40 నుంచి 60 శాతం తక్కువ వర్షాలు మాత్రమే కురిశాయి. కృష్ణానదిపై ఉన్న బ్యారేజీలలో నుంచి చుక్క నీరు వ్యవసాయం కోసం విడుదల చేసే పరిస్థితి లేదు. కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఆల్మట్టి నుంచి పులిచింతల వరకూ అన్ని ప్రాజెక్టులూ నిండుకున్నాయి. మరోవైపు గోదావరి నదిలోనూ ఇదే పరిస్థితి. కాలువల్లో నీరు పారక ఉభయ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో ఇంకా వరి నారు వేయలేదు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురవకుంటే ఖరీఫ్ నష్టపోయినట్టేనని, ఇక ప్రధాన పంటలు వదిలేసుకోవాల్సిన వస్తుందని రైతులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News