: గుర్గావ్ ప్రాంతంలో కార్మికుడిని బలిగొన్న రోబో


ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీల్లో రోబోల వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే, యాజమాన్యానికి సమయం, ధనం ఆదా చేసే ఆ రోబోలు కొన్నిసార్లు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా, గుర్గావ్ ప్రాంతంలోని నూతన పారిశ్రామికవాడ మనేసర్ లో ఓ కార్మికుడు రోబో కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎస్కేహెచ్ మెటల్స్ కంపెనీలో రామ్జీ లాల్ (24) అనే వ్యక్తి లోడర్ గా పనిచేస్తున్నాడు. లాల్ వెల్డింగ్ యూనిట్ లో విధుల్లో ఉన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్ లో 63 మంది వరకు కార్మికులు, 39 రోబోలు విధి నిర్వహణలో ఉన్నట్టు తెలిసింది. కాగా, లాల్ ప్రాణాలు హరించిన రోబో పని మెటల్ షీట్లను పైకెత్తి వెల్డింగ్ చేయడమే. అయితే, ఓ షీట్ నిర్దేశిత స్థానం నుంచి పక్కకు జరగడంతో దాన్ని సరిచేసేందుకు లాల్ యత్నించాడు. ఆ క్రమంలో రోబోకు అటాచ్ చేసిన వెల్డింగ్ స్టిక్స్ లాల్ కడుపులో గుచ్చుకున్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. లాల్ విధుల్లో చేరి ఒకటిన్నర సంవత్సరం అయినట్టు తెలిసింది. అతడు యూపీలోని ఉన్నావో ప్రాంతానికి చెందినవాడు.

  • Loading...

More Telugu News