: పవన్ హన్స్ మృతదేహాలను కనుగొన్న హెచ్ఏడబ్ల్యూఎస్ కమాండోలు
ఈ నెల మొదటి వారంలో పవన్ హన్స్ హెలికాప్టర్ గల్లంతు కాగా, అందులో ప్రయాణించిన ముగ్గురి మృతదేహాలను బుధవారం గుర్తించారు. అసోంలోని డిబ్రూగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని ఖోన్సా వెళుతుండగా హెలికాప్టర్ ఆచూకీ లేకుండా పోయింది. సెర్చ్ ఆపరేషన్ కు ఉపక్రమించిన హై ఆల్టిట్యూడ్ వార్ ఫేస్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యూఎస్) కమాండోలు అరుణాచల్ ప్రదేశ్ లోని తిరావ్ జిల్లాలో ఉన్న పర్వత ప్రాంతాల్లో మృతదేహాలను కనుగొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమలేశ్ కుమార్, ఇద్దరు పైలెట్లు ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలను ఖోన్సాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.