: కేటీఆర్ గన్ మన్, డ్రైవర్ కు నోటీసులిచ్చేందుకు ఏపీ సీఐడీ విఫలయత్నం


ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులివ్వడంతో ఏపీ సీఐడీ వెంటనే స్పందించడం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్ మన్, డ్రైవర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆ నోటీసులు అందించేందుకు విజయవాడ నుంచి సీఐడీ డీఎస్పీ షేక్ షా వలి హైదరాబాదు వచ్చారు. సీఎం కార్యాలయానికి, కేటీఆర్ నివాసానికి, నిఘా-భద్రతా విభాగం కార్యాలయానికి వెళ్లగా... కేటీఆర్ గన్ మన్, డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. దాంతో, గురువారం వారి నివాసాల చిరునామా తెలుసుకుని, అక్కడికి వెళ్లి నోటీసులు అందజేయాలని నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News