: అసిన్, రాహుల్ ఒకే కప్ బోర్డులో దాక్కున్నారట... అంతా అక్షయ్ మహిమ!
నటి అసిన్ పెళ్లి మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో ఫిక్సవడం తెలిసిందే. అసిన్ ను రాహుల్ కు పరిచయం చేసింది హీరో అక్షయ్ కుమార్ అని తెలుసు కానీ, వారి ప్రేమకు దాగుడుమూతల ఆట కారణమని తాజాగా వెల్లడైంది. అక్షయ్ తన చిలిపితనంతో అసిన్, రాహుల్ మధ్య ప్రేమ చిగురించేందుకు తోడ్పడ్డాడట. అదెలాగో అక్షయ్ మాటల్లోనే విందాం! "ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అప్పుడు మేం హౌస్ ఫుల్-2 సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలో ఉన్నాం. మరి, నేను చెప్పేది విని మీరు నవ్వకూడదు. అప్పుడు మేం దాగుడుమూతలు ఆడాం. ఆ సమయంలో అసిన్, రాహుల్ ఇద్దరూ ఒకే కప్ బోర్డులో దాక్కునేలా ప్లాన్ చేశాను. నా ప్లాన్ సక్సెసయింది... వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది! ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. అయితే, నా కో-స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా మాతోపాటే ఉన్నాగానీ, దాగుడుమూతల ఆట ఆంతర్యం ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాను. అమాయకంగా మాతో ఆడేసింది. ఈ ప్రేమోద్భవంలో ఆమె పాత్ర కూడా ఉంది" అని వివరించాడు.