: మన ఆటకు పోలెండ్ లో నీరాజనం


అచ్చమైన భారతీయ క్రీడ అంటే కబడ్డీ పేరే చెప్పుకోవాలి. క్రమంగా ఇది పలు దేశాల్లో ప్రవేశిస్తోంది. ప్రొ కబడ్డీ లీగ్ పుణ్యమా అని విదేశాల్లోనూ దీనికి క్రేజ్ పెరుగుతోంది. వచ్చే ఏడాదికల్లా పోలెండ్ లోనూ కబడ్డీ పాప్యులర్ స్పోర్ట్ గా ఎదగడం ఖాయమంటున్నాడు ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత కబడ్డీ క్రీడాకారుడు మైకేల్ స్పిక్కో. ఈ ఆటగాడు ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్ లో బెంగళూరు బుల్స్ జట్టుకు ఆడుతున్నాడు. "నన్నడిగితే... వచ్చే ఏడాదికల్లా పోలెండ్ లో కబడ్డీ భారీస్థాయిలో ప్రజాదరణ పొందుతుంది. కబడ్డీకి ఎందరో అభిమానులుగా మారుతున్నారు. ప్రజల్లో ఈ ఆటపై తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఇది కచ్చితంగా స్పాన్సర్లను ఆలోచింపజేసే అంశమే. అయితే, ప్రొ కబడ్డీ తరహా లీగ్ ను పోలెండ్ లో నిర్వహించడానికి కొంత సమయం పడుతుంది. ఇది జట్టుగా ఆడే ఆట. ఇలాంటి క్రీడలనే పోలెండ్ ప్రజలు ఇష్టపడతారు" అని వివరించారు.

  • Loading...

More Telugu News