: పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీకి నాన్ బెయిలబుల్ వారెంట్
విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎమ్మెల్యే సహా ఏడుగురికి పాడేరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వారెంట్ జారీ చేశారు. పాడేరు సినిమా హాల్ లీజు కేసులో కోర్టుకు హాజరుకానందున వారెంట్ జారీ అయింది.