: 'సెల్యూట్ సెల్పీ'లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న సెలెబ్రిటీలు
69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను పురస్కరించుకుని సెలబ్రిటీలు 'సెల్యూట్ సెల్ఫీ'తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమం, దేశ రక్షణలో అమరులైన వీర జవాన్లకు నివాళిగా 'సెల్యూట్ సెల్ఫీ' ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, షారూఖ్ ఖాన్, షాహిద్ కపూర్, టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య, ప్రముఖ క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తదితరులు తాము దిగిన సెల్యూట్ సెల్ఫీలను తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టు చేసి... అభిమానులు కూడా 'సెల్యూట్ సెల్ఫీ' ఉద్యమంలో పాల్గొని, దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు నివాళులర్పించాలని పిలుపునిస్తున్నారు. వీరి పిలుపుకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.