: డిసెంబర్ చివరి నాటికి సెట్ టాప్ బాక్సులు ఉండాల్సిందే: తలసాని
టీవీ వీక్షకులు సెట్ టాప్ బాక్సులు తప్పని సరిగా పెట్టుకోవాలని టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. డిసెంబర్ 31 నాటికి ప్రతి ఒక్కరూ ఈ బాక్సులను పెట్టుకోవాల్సిందే అని హెచ్చరించారు. ఈ రోజు హైదరాబాదులోని హైటెక్స్ లో 4వ కేబుల్ ఎక్స్ పోను తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో, పోల్ టాక్స్ రద్దు చేయాలని ఎంఎస్ఓలు కోరగా... తలసాని సానుకూలంగా స్పందించారు.