: లోక్ సభలో తీవ్ర గందరగోళం... వివరణ ఇస్తున్న సుష్మాస్వరాజ్
లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. లలిత్ మోదీ విషయంలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలపై మంత్రి సుష్మాస్వరాజ్ కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివరణ ఇస్తున్నారు. కాగా సుష్మ సమాధానం వినాలని ఇష్టం లేకపోతే బయటికి వెళ్లిపోవాలని కాంగ్రెస్ సభ్యులకు స్పీకర్ సూచించారు. అయిన్పపటికీ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నినాదాలు చేస్తున్నారు. అంతేగాక తాము వేసిన ఏడు ప్రశ్నలకు సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.