: ఏపీలో 40 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం


ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 60,770 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా అందులో ఏకంగా 40 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. అన్యాక్రాంతమైన ఈ భూములను జీవో నెం.18 ద్వారా స్వాధీనపరుచుకుంటామని చెప్పారు. ఈరోజు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు. అలాగే, ముస్లింల వివాహ పథకం ద్వారా పెళ్లి చేసుకునే ముస్లిం జంటకు రూ. 50 వేలను చెల్లిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News