: ప్రభుత్వ విప్ చింతమనేనికి తృటిలో తప్పిన ప్రమాదం ... గన్ మెన్ కు తీవ్ర గాయాలు
ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు ఇవాళ కొద్దిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా పేదవేగి మండలం పోలవరం కుడి కాలువపై ఆయన, గన్ మెన్ లు చెట్లను తొలగిస్తుండగా అకస్మాత్తుగా ఓ చెట్టు విరిగిపడింది. ఈ సమయంలో గన్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.