: చెన్నైలో వాట్సన్ వన్ మ్యాన్ షో


ఐపీఎల్-6లో తొలి సెంచరీ నమోదైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షేన్ వాట్సన్ మెరుపు సెంచరీతో అలరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలో దిగిన వాట్సన్ 61 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. వాట్సన్ పరుగుల సునామీ సృష్టించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. మిడిలార్డర్లో బిన్నీ అజేయంగా 36 పరుగులు సాధించాడు. చెన్నై బౌలర్లలో అశ్విన్, బ్రావో చెరో రెండు వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News