: 'పార్లమెంటును పనిచేయనివ్వండి'... ఆదీ గోద్రేజ్, క్రిస్ గోపాలకృష్ణన్, సునీల్ ముంజాల్, రాహుల్ బజాజ్ సహా 15 వేల మంది పారిశ్రామికవేత్తల వినతి


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలై మూడు వారాలు గడుస్తున్నా, అధికార విపక్ష సభ్యుల బాధ్యతారాహిత్యం, దేశానికి మేలు చేసేలా ఒక్క చర్చను కూడా జరగనీయలేదు. ఎన్నో కీలక బిల్లులు సభ ముందుకు రాకుండా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత పరిశ్రమల సమాఖ్య ఘాటుగా స్పందించింది. పార్లమెంటును పనిచేయనివ్వాలని, ప్రతిరోజూ అడ్డుకోవడం సమంజసం కాదని 15 వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఆన్ లైన్ పిటిషన్ పై సంతకాలు చేసి పంపారు. జీఎస్టీ వంటి బిల్లులపై చర్చించి, అవసరమైన మార్పులు చేసి అమలు పరచాలని వారు కోరారు. ఈ పిటిషన్ పై సంతకాలు చేసిన పారిశ్రామిక దిగ్గజాల్లో సునీల్ ముంజాల్, ఆదీ గోద్రేజ్, కిరణ్ మజుందార్-షా, రాహుల్ బజాజ్, అనూ ఆగా, అజయ్ శ్రీరామ్, సుమిత్ మజుందార్, క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఉన్నాయి. కావాలని జరుగుతున్న రాద్ధాంతాల కారణంగా జీఎస్టీ వంటి ముఖ్యమైన బిల్లులు ఆగరాదని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పార్లమెంట్ సమావేశాలు రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News