: చాలా గర్వంగా ఉంది.... సుందర్ పిచయ్ ప్రస్థానంపై చెస్ దిగ్గజం ఆనంద్
గూగుల్ సీఈఓగా ఎంపికైన సుందర్ పిచయ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, సహా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సుందర్ పిచయ్ ను అభినందిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. తాజాగా చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా సుందర్ ప్రస్థానంపై హర్షం వ్యక్తం చేశాడు. తమిళనాడుకు చెందిన ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ తన రాష్ట్రానికి చెందిన సుందర్ ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీకి సీఈఓ కావడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నాడు.