: ఏపీ ఎక్స్ ప్రెస్ పై సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల సిగపట్లు


కొత్త ఏపీ ఎక్స్ ప్రెస్ ... పట్టాలెక్కింది ఇప్పుడే, అప్పుడే ఈ రైలు బాధ్యత తమదంటే, కాదు తమదంటూ... దక్షిణ మధ్య, ఈస్ట్ కెోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య వివాదం తలెత్తింది. వివరాల్లోకెళితే... రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మారనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దేశ రాజధానికి ప్రత్యేక రైలు నడపాలన్న డిమాండ్ల నేపథ్యంలో విజయవాడ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ ను నడపనున్నట్లు మొన్నటి రైల్వే బడ్జెట్ లో కేంద్రం ప్రకటించింది. అయితే ఈ రైలును విశాఖపట్నం దాకా నడిపిస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి వినతి మేరకు రైల్వే శాఖ ఈ రైలును విశాఖ దాకా పొడిగించింది. విజయవాడ రైల్వే డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో ఉండగా, విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ఉంది. ఇక్కడే సమస్య తలెత్తింది. బడ్జెట్ లో ఏపీ ఎక్స్ ప్రెస్ ను కేంద్రం ప్రకటించిన వెంటనే సదరు రైలు బోగీలన్ని నాడే విజయవాడకు చేరుకున్నాయి. వాటి పర్యవేక్షణ మొత్తాన్ని సౌత్ సెంట్రల్ జోనే చూసుకుంది. తాజాగా ఈ రైలు కొద్దిరోజుల క్రితం విశాఖకు చేరుకుంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ రైలుకు గార్డు బాధ్యతలపై రెండు జోన్లకు చెందిన అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. విశాఖ నుంచి నడుస్తున్న ఈ రైలు బాధ్యత తమదేనని ఈస్ట్ కోస్ట్ జోన్ అధికారులు చెబుతుండగా, కేవలం 17 కిలో మీటర్ల పరిధి మాత్రమే ఈస్ట్ కోస్ట్ లో ఉందని, మిగిలిన ప్రాంతమంతా తమ పరిధిలోకే వస్తుందని వాదిస్తున్న సౌత్ సెంట్రల్ అధికారులు తమ గార్డునే రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే దాకా వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News