: ఏపీ ఎక్స్ ప్రెస్ లో అన్నీ ఏసీ బోగీలేనట!
ప్రస్తుతం హైదరాబాదు-న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగిస్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ (గతంలో ఇది ఏపీ ఎక్స్ ప్రెస్) లో ఏసీ కేటగిరిలో ఏసీ ఫస్ట్ క్లాస్ తో పాటు ఏసీ 2 టైర్, 3 టైర్ బోగీలతో పాటు నాన్ ఏసీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. కాగా, నేటి నుంచి విశాఖపట్నం-న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించనున్న 'ఏపీ ఎక్స్ ప్రెస్'లో అన్నీ ఏసీ బోగీలే ఉన్నాయట. అంటే నాన్ ఏసీ కేటగిరీలోని స్లీపర్ క్లాస్ బోగీలు ఆ రైల్లో కనిపించవు. ఇక ఈ రైలు వారానికి మూడు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది. విశాఖ నుంచి ఢిల్లీకి బుధ, శుక్ర, ఆదివారాల్లో బయలుదేరనున్న ఈ రైలు... ఢిల్లీ నుంచి విశాఖకు సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరుతుంది.