: టీవీ సీరియల్ చూసి మహిళ ఆత్మహత్య!


తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ టీవీ సీరియల్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాన్పూర్ లోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన రుచి (22) అనే వివాహిత గత కొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ కు ఆమె చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం టీవీ సీరియల్ చూసిన రుచి, ఆ సీరియల్ లో తన అభిమాన నటి ఆత్మహత్య చేసుకోవడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న రుచి, తరువాత తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీరియల్ లో నటి గురించి ఎక్కువ మాట్లాడేదని రుచి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News