: ఆ స్థానంలో రోహిత్ వద్దు... కోహ్లీనే ఆడాలి: గవాస్కర్
శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా వన్ డౌన్లో విరాట్ కోహ్లీ రావాలని అంటున్నారు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఆ స్థానంలో రోహిత్ శర్మను పంపాలని జట్టు వ్యూహకర్తలు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, వారితో గవాస్కర్ విభేదిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం చాలా కీలకమని, ఆ స్థానానికి కోహ్లీ అతికినట్టు సరిపోతాడని ఈ క్రికెట్ దిగ్గజం అభిప్రాయపడ్డారు. పుజారా కంటే రోహిత్ మెరుగైన ఎంపికే అయినా, కోహ్లీనే వన్ డౌన్లో ఆడాలని సూచించారు. ఆ స్థానంలో బరిలో దిగడం ద్వారా మిగతా బ్యాట్స్ మెన్ ఆడేందుకు కోహ్లీ తగిన వేదిక సిద్ధం చేయగలడని వివరించారు.