: వెంకయ్యనాయుడును ఏపీలో తిరగనిచ్చేది లేదు: సీపీఐ నారాయణ


ఏపీకి ప్రత్యేకహోదాపై తక్షణం నిర్ణయం తీసుకోని పక్షంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఆంధ్రప్రదేశ్ లో తిరగనిచ్చేది లేదని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ చేతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు ప్రత్యేకహోదాపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News