: బందీలను చంపడంలో క్రియేటివిటీ ప్రదర్శిస్తున్న ఐఎస్ మిలిటెంట్లు


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) దారుణాలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. బందీలుగా పట్టుబడ్డ వారిని చంపేందుకు ఐఎస్ మిలిటెంట్లు కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు. పీకలు కోయడం, రాళ్లతో కొట్టి చంపడం, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడం, ఎత్తైన భవనాల పైనుంచి కిందికి తోయడం, బోనుల్లో బంధించి మంట పెట్టడం, నీళ్లలో ఊపిరాడకుండా చేయడం వంటి కిరాతకాలతో ఐఎస్ మిలిటెంట్లు ఎన్నోసార్లు వార్తల్లోకెక్కారు. తాజాగా, ఆఫ్ఘనిస్థాన్ లోని నంగర్హార్ ప్రావిన్స్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన పదిమందిని చంపేందుకు వినూత్న పంథా ఎంచుకున్నారు. భూమిని తవ్వి లోపల పేలుడు పదార్థాలు ఉంచారు. వాటిపై మట్టిని కప్పి, ఆ మట్టి మీద బందీలను మోకాళ్లపై కూర్చోబెట్టారు. మోకాళ్ల కిందే ఆ పేలుడు పదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం, బందీలకు దూరంగా వెళ్లిన ఐఎస్ మిలిటెంట్లు రిమోట్ సాయంతో ఆ పేలుడు పదార్థాలను పేల్చివేశారు. దాంతో, బందీల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ మారణకాండ వీడియోను ఆన్ లైన్ లో విడుదల చేశారు.

  • Loading...

More Telugu News