: ఏపీకి పన్ను రాయితీ, నిధులు అందిస్తాం: అరుణ్ జైట్లీ


పునర్వ్యవస్థీకరణతో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదాపై టీడీపీ ఎంపీలు తనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పునర్వ్యస్థీకరణ చట్టంలో ఎలాంటి వెసులుబాటు కల్పించకుండా, యూపీఏ ప్రత్యేకహోదా ప్రకటన చేసిందని అన్నారు. బిల్లులో భాగంగా హైదరాబాదు తెలంగాణకు దక్కడంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిందని అన్నారు. రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. పన్నుల రాయితీతో ఏపీకి ఇప్పటికే కొంత వెసులుబాటు కల్పించామని చెప్పిన ఆయన, త్వరలోనే మరికొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రకటన చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సాయం కేంద్రం అందజేస్తుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News