: కరీంనగర్ జిల్లాలో దారుణం... గుడి నిర్మాణానికి చందా ఇవ్వలేదని మూడు కులాల వారి బహిష్కరణ
గుడిని నిర్మించేందుకు అడిగినంత చందా ఇవ్వలేమని చెప్పిన కారణంగా ఆ గ్రామంలోని మూడు కులాల ప్రజలను బహిష్కరించారు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, గ్రామంలో గంగామాత ఆలయం నిర్మించాలని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. గ్రామంలోని ఒక్కో కుటుంబమూ రూ. 500 వంతున గుడి నిర్మాణం నిమిత్తం చందాగా ఇవ్వాలని ఆదేశించింది. గ్రామంలోని విశ్వబ్రాహ్మణ, పద్మశాలీ, మాల కులస్తులు తాము అంత చందాలు ఇవ్వలేమని వేడుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామ కమిటీ పెద్దలు, వీరిని సాంఘికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇతరులెవరూ వీరితో లావాదేవీలు జరపరాదని, సంబంధాలు పెట్టుకోరాదని ఆదేశించారు. ఈ పరిణామాలతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.