: ఫ్యాన్స్ కు 'శ్రీమంతుడు' మరో కానుక!
మహేష్ బాబు తాజా సూపర్ హిట్ చిత్రం 'శ్రీమంతుడు' చిత్రానికి కొన్ని అదనపు సీన్లను జోడించనున్నారట. సినిమా క్లైమాక్స్ కు ముందు రాజేంద్రప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వదిలి పోతుంటే, మహేష్ బాబు అడ్డుకునే దృశ్యాలను ఈ వారం నుంచి చిత్రానికి కలపనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి సినిమా ట్రైలర్లో ఈ సీన్ కనిపిస్తుంది. కానీ, థియేటర్లలో ఈ సీన్ కనిపించదు. నిడివి ఎక్కువవుతుందన్న కారణంగా ఈ సీన్ ను మొదట్లో తొలగించిన దర్శకుడు, ఇప్పుడు దీన్ని కలిపి చిత్రంలో మరింత సెంటిమెంట్ ను జోడించనున్నాడని సమాచారం. ఇది మహేష్ ఫ్యాన్స్ కు మరో కానుకేనని చెప్పవచ్చు. కాగా, దర్శకుడు కొరటాల శివ, తన మొదటి చిత్రం 'మిర్చి'లో సైతం విడుదలైన కొద్ది రోజుల తరువాత 'రెయిన్ ఫైట్'ను కలిపి ప్రభాస్ అభిమానులను మరోసారి థియేటర్ కు రప్పించడంలో విజయవంతమయ్యాడు.