: జుట్టు, గోరు నమూనాలను ప్రధానికి పంపిన జెడి(యు) కార్యకర్తలు
ప్రధాని నరేంద్రమోదీ డీఎన్ఏ వ్యాఖ్యలపై జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నిరసన కొనసాగుతోంది. మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా 'షబ్ద్ వాపసి' (మాటలను వెనక్కి తీసుకోవడం) ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని తమ పార్టీ ఎదురుచూస్తోందని, కానీ ఆయన్ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు వారి జుట్టు, గోరు నమూనాలను ప్రధానికి ఇప్పటికే పంపారని నితీశ్ చెప్పారు. ఆయన వాటిని స్వేచ్ఛగా పరీక్షించవచ్చన్నారు. గత నెల 25న ముజఫర్ నగర్ లోని ఓ పబ్లిక్ మీటింగ్ లో నితీష్ డీఎన్ఏ పై ప్రధాని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మొదలైంది.