: కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్ ఉంటుంది... ఆ తర్వాత 14 ముక్కలవుతుంది: కోమటిరెడ్డి


టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి సీఎల్సీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్ మనుగడ ఉంటుందని... ఆ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, కవిత, వినోద్ ఇలా 14 ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. జై తెలంగాణ అనొద్దని బెదిరించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రి పదవులిచ్చారని... ఉద్యమంలో కొడుకుని పోగొట్టుకున్న శంకరమ్మకు మాత్రం మొండి చేతులే మిగిలాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News