: సుందర్ పిచాయ్ కి అభినందనల వెల్లువ


గూగుల్ కొత్త సీఈఓగా నియమితులైన భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ కి పలువురు టెక్ దిగ్గజాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘మైక్రోసాఫ్ట్’ సీఈవో సత్య నాదెళ్ల, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎరిక్ స్కెమిట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సుందర్ దార్శనికత కలిగిన వ్యక్తి అని, త్వరలోనే గొప్ప చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎదుగుతారని ఎరిక్ తన ట్విట్టర్ ఖాతాలో అభినందించారు. "ఓ గొప్ప అవకాశాన్ని పొందావు, కంగ్రాచ్యులేషన్స్" అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య వ్యాఖ్యానిస్తే, ఇది సుందర్ తెలివితేటలకు, కృషికి దక్కిన ఫలితమని ఎరిక్ ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచ టెక్ దిగ్గజాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈఓలుగా ఇండియన్స్ నియమించబడటం మొత్తం దేశానికే గర్వకారణం.

  • Loading...

More Telugu News