: పార్లమెంట్ కార్యకలాపాలను యథాతథంగా 'లైవ్'లో చూపండి: లోక్ సభ టీవీకి స్పీకర్ ఆదేశం
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ మధ్యాహ్నం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం దేశ ప్రజలందరికీ తెలియాలని అన్నారు. లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలను ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా యథాతథంగా 'లైవ్'లో చూపాలని ప్రసారభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న లోక్ సభ టీవీకి ఆదేశాలిచ్చారు. సభలో జరుగుతున్న గొడవను చూపకుండా స్పీకర్ చైర్, మాట్లాడుతున్న సభ్యుల దృశ్యాలను మాత్రమే చూపడం వల్ల విపక్షాలు చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు ప్రజలకు తెలియడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.