: ఆధార్ ఉండాలా? వద్దా?... సుప్రీంలో కీలక విచారణ
భారత పౌరులకు వివిధ పథకాల్లో ఆధార్ తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు కీలక విచారణను చేపట్టనుంది. గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఆధార్ అమలు విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నేటి మధ్యాహ్నం కోర్టు విచారణ జరపనుంది. దీంతో పాటు ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింపుపై కూడా సుప్రీం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వివిధ పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ, పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి విదితమే.