: మండలానికి ఒక గ్రామాన్ని ఎమ్మెల్యేలు దత్తత తీసుకోవాలి: సీఎం కేసీఆర్


గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాల్లో వెలుతురు వచ్చేలా గ్రామజ్యోతిని వెలిగిద్దామని చెప్పారు. అన్ని గ్రామాలకు సంబంధించి నాలుగేళ్ల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంపై హైదరాబాద్ లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగడం లేదని, ప్రజలే గ్రామ సభల్లో ప్రాతినిధ్యం వహించాలని కోరారు. సమస్యలను గుర్తించాలని చెప్పారు. మండలానికి ఒక ఊరిని ఎమ్మెల్యేలు దత్తత తీసుకోవాలన్నారు. తాను కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News