: విజయవాడ నుంచి చంద్రబాబు పాలన చేస్తే ఏం ఒరుగుతుంది?: రఘువీరా


ఏపీ ప్రభుత్వ పాలనను ఇక నుంచి నాలుగు రోజుల పాటు విజయవాడ నుంచే కొనసాగించాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తప్పుబట్టారు. విజయవాడలో కూర్చుని పాలన సాగించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు గట్టిగా పోరాటం చేయడం లేదని, ముందు హోదా సాధిస్తే అప్పుడు విజయవాడ నుంచి పాలన చేసినా ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో హోదా డిమాండ్ తో ఈరోజు చేస్తున్న బంద్ లో రఘువీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీ సీఎం, మంత్రులు, ఎంపీలు అందరూ ఢిల్లీలో కూర్చుని హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. తాము ప్రజా పోరాటాలు చేస్తామని, దాని ఆసరాగా ఏపీకి హోదా సాధించుకురావాలని టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో?

  • Loading...

More Telugu News