: హృదయవిదారకం... 9 ఏళ్ల కొడుకును బతికించేందుకు ఎడారిలో ప్రాణాలొదిలిన తల్లిదండ్రులు


ఎడారి అందాలను చూసేందుకు పర్యాటకులుగా తమ 9 ఏళ్ల కొడుకు 'ఎంజో'ను తీసుకువెళ్లారా తల్లిదండ్రులు. అనుకోని పరిస్థితుల్లో ఎడారి మధ్యలో చిక్కుకుపోయి, ఎండ వేడికి తాళలేక, కొడుకునైనా బతికించుకుందామని, వారివద్ద ఉన్న మంచినీటినంతా ఆ బాబుకిచ్చి, తమ ప్రాణాలు వదిలారు. చదివితేనే హృదయం బరువెక్కి పోయే ఈ ఘటన ఫ్రాన్స్ పరిధిలోని వైట్ శాండ్స్ ప్రాంతంలో జరిగింది. వీరి గురించి వెతుకుతూ వెళ్లిన పెట్రోలింగ్ సిబ్బందికి తల్లిదండ్రుల మృతదేహాల పక్కనే అపస్మారక స్థితిలో బాలుడు కనిపించాడు. తండ్రి మృతదేహం పక్కనే ఖాళీగా ఉన్న రెండు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. "ఎంజో తల్లిదండ్రులు నీటిని బాలుడి కోసం దాచి తమ ప్రాణాలు త్యాగం చేశారు" అని పోలీసులు వివరించారు. తక్కువ నీటిని తాగినా, చిన్న పిల్లాడు కావడం వల్లే ఎంజో ప్రాణాలు దక్కాయని తెలిపారు. తాము ప్రయాణిస్తున్న కారు ఎడారి మధ్యలో చెడిపోయిందని మాత్రమే చెబుతున్న ఎంజో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News