: ములాయంకు ప్రధాని మోదీ ప్రశంసలు
సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. పార్లమెంట్ లో ప్రతిరోజు ప్లకార్డులతో ఆందోళన చేస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను ములాయం హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని ఆయనను కొనియాడారని తెలిసింది. ఢిల్లీలో ఈరోజు జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ములాయం విషయం ప్రస్తావనకు వచ్చింది. కొంతమంది దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు పార్లమెంట్ ను తప్పుదారి పట్టిస్తున్నారని మోదీ అన్నారు. అయితే సభలో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు, సభా సజావుగా జరిగేందుకు ములాయం పరోక్షంగా మంచి పని చేశారని ప్రధాని అన్నట్టు తెలిసింది.