: సుప్రీంను శరణువేడిన దయానిధి మారన్... బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
టెలికాం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత దయానిధిమారన్ కు మరిన్ని కష్టాలొచ్చాయి. కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మద్రాస్ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ నిన్నటిదాకా రక్షగా నిలబడింది. తాజాగా నిన్న మద్రాస్ హైకోర్టు ఆ బెయిల్ ను రద్దు చేయడమే కాక మూడు రోజుల్లోగా సీబీఐ అధికారుల ముందు హాజరుకావాలని మారన్ కు సూచించింది. దీంతో దయానిధి మారన్ సుప్రీంకోర్టుకు పరుగులు పెట్టారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మారన్ పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది.