: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం... అధికారులకు చంద్రబాబు ఆదేశం


ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమవుతోంది. విజయవాడలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం అగ్రిగోల్డ్ వ్యవహారంపై అధికారులతో సమీక్షించారు. అసలు అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది ఉన్నారు? సంస్థ చెల్లించాల్సిన సొమ్ము ఎంత? సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ఎంత? అన్న పలు అంశాలపై చంద్రబాబు సమగ్రంగా సమీక్షించారు. అగ్రిగోల్డ్ నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసి వచ్చిన డబ్బును డిపాజిటర్లకు అందజేయాలని కూడా ఆయన ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలపై దృష్టి సారించిన సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులను కోర్టు ద్వారా వేలం వేసేందుకు కసరత్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News