: వాయిదా తీర్మానాలను తోసిపుచ్చిన స్పీకర్.. ఆందోళనకు దిగిన వైసీపీ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ, టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వివిధ అంశాలపై పలు పార్టీలు అందజేసిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు లలిత్ మోదీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు సభలో ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.