: స్వల్పకాలిక చర్చకైనా అనుమతించండి... లోక్ సభకు టీడీపీ నోటీస్
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతించాల్సిందేనని టీడీపీ పట్టుబడుతోంది. ఈ మేరకు నిన్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు నోటీసు అందించిన ఆ పార్టీ ఎంపీలు తాజాగా నేడు కూడా నోటీసు ఇచ్చారు. కనీసం స్వల్పకాలిక చర్చ (షార్ట్ డిస్కషన్)కు అయినా అనుమతించాలని రూల్ 193 కింద ఆ పార్టీ నోటీసు ఇచ్చింది. ఇదిలా ఉంటే, నిన్నటి నోటీసుకు స్పీకర్ స్పందించని విషయం తెలిసిందే. తాజాగా నేటి నోటీసుకు కూడా స్పీకర్ నుంచి సానుకూల స్పందన వెలువడే అవకాశాలు లేవన్న భావనతో ఉన్న ఆ పార్టీ ఎంపీలు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిన్ననే రూపొందించుకున్నట్లు సమాచారం.