: 10 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం లేదంటూ... సమ్మెకు దిగిన ఇస్రో ఉద్యోగులు


ఇస్రో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేపట్టారు. తమకు రావల్సిన 10 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం లేదని, ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన అలవెన్సులు కూడా ఇవ్వడం లేదన్న కారణాలతో నిరసన తెలుపుతున్నారు. అంతేగాక జీతాలు పెంచమని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ స్పందించలేదని చెప్పారు. దీంతో ఈ సమ్మెవల్ల ఈ నెల 28న జీఎస్ఎల్ వీ ప్రయోగం ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News