: కేజ్రీవాల్ కు దూరంగా ఉండు... లేకపోతే చంపేస్తాం: అన్నా హజారేకు బెదిరింపు లేఖ


ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారేకు బెదిరింపు లేఖ వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి దూరం కావాలని... లేకపోతే చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. 2013లో పూణేలో హేతువాది నరేంద్ర దభోల్కర్ ను కాల్చి చంపినట్టే చంపాల్సి వస్తుందని పేర్కొన్నారు. స్వగ్రామం రాలేగావ్ సిద్దిలోనే ఉండాలని, అక్కడ నుంచి కదలరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ లేఖ రాశారు. లేఖలో ఎక్కువగా ఇంగ్లీషు భాషనే వాడారు. ఈ లేఖపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 (నేరపూరితంగా భయపెట్టడం) కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News