: మార్స్ ఉపరితలంపై మహిళ?


నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి చిత్రాలను భూమికి చేరవేసింది. ఆ చిత్రాల్లో కనిపిస్తున్న ఓ ఆకారం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఓ శిలపై నిల్చున్నట్టుగా ఉన్న ఆ ఆకారం ఓ మహిళను పోలి ఉండడంతో అందరిలోనూ ఆసక్తి అధికమైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై చర్చ నడుస్తోంది. ఆ ఆకారం ఓ రాయి అని కొందరు, ఓ మహిళ అని ఇంకొందరు వాదించుకుంటున్నారు. గతంలోనూ ఇలాంటివే ఎన్నో అంశాలు ఆసక్తి రేకెత్తించినా నాసా మాత్రం దేనికీ స్పందించలేదు. ఆయా అంశాలను ఔత్సాహికుల ఊహకే వదిలేసింది.

  • Loading...

More Telugu News