: హీరో రామ్ కు గాయం...ఆరు వారాల విశ్రాంతి


టాలీవుడ్ యువ నటుడు రామ్ షూటింగ్ లో గాయపడ్డాడు. ఎనర్జిటిక్ హీరోగా పేరొందిన రామ్ తాజా సినిమా 'శివం'లో యాక్షన్ సీన్ చిత్రీకరించేటప్పుడు చేతి లిగ్మెంట్ దెబ్బతింది. దీంతో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, వైద్యుల సూచనను నిర్లక్ష్యం చేసిన రామ్, అలాగే మరో నాలుగు యాక్షన్ సీన్స్ చేశాడు. దీంతో గాయం కాస్తా పెద్దదైంది. ఇప్పుడు వైద్యులు ఆరు వారాల విశ్రాంతి సూచించారు. దీంతో 'వైద్యులు చెప్పింది శ్రద్ధగా పాటించకపోతే ఇలాగే అవుతుంది. విదేశాల్లో షూటింగ్ ఉండగా, విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది' అంటూ రామ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతానికి వైద్యులు ఫిజియో థెరఫీ, వ్యాక్స్ థెరఫీ ఇస్తున్నారని పేర్కొంటూ, గాయంతో ఉన్న తన చేతి ఫోటోలను ట్విట్టర్లో పెట్టాడు రామ్. కాగా, 'శివం'సినిమాలో రామ్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది.

  • Loading...

More Telugu News