: టైగర్ ప్రాజెక్టు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఓకే చెప్పిన అమితాబ్


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మహారాష్ట్ర పులుల సంరక్షణ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరించేందుకు అంగీకరించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రచారకర్తగా వ్యవహరించాలంటూ మహారాష్ట్ర సర్కారు గతవారం అమితాబ్ కు ఓ లేఖ రాసింది. సర్కారు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన బిగ్ బి సోమవారం తన సమ్మతి తెలిపారు. అంతకుముందు, మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగాంతివర్ టైగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... "పులుల సంరక్షణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి విషయాన్ని అటవీశాఖ ఒక్కటే చేయజాలదు. ప్రజా భాగస్వామ్యం కూడా అవసరం. ఆ కారణంగానే బ్రాండ్ అంబాసడార్లను నియమిస్తున్నాం" అని వివరించారు.

  • Loading...

More Telugu News