: అక్కడ 'గాలి' వ్యాపారం కూడా మొదలైంది!
ప్రకృతి సహజమైన మంచి నీళ్లను బాటిళ్లలో నింపి ఇప్పటికే చాలా కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. ఇప్పుడు వారి కన్ను 'గాలి' మీద పడింది. దాంతో గాలి (ఆక్సిజన్) అమ్మకాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో కాలుష్యం రాజ్యమేలుతోంది. దీంతో అక్కడ స్వచ్ఛమైన గాలి దొరకడం లేదనేది స్ధానికుల అభిప్రాయం. దీనిని వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లలో పెట్టి అమ్ముతున్నారు. వీటిని కొనుక్కుంటున్న వారిలో మిలియనీర్లే ఎక్కువగా ఉన్నప్పటికీ, రోగాల భయం ఉన్నవారంతా వీటిని కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భవిష్యత్ లో 'గాలి' వ్యాపారం ప్రపంచం నలుమూలలకూ వీస్తుందని ప్రైవేటు కంపెనీలు భావిస్తున్నాయి.