: సెప్టెంబర్ లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ లో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు ప్రధాని పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. 23 నుంచి 25వ తేదీ వరకు ఆయన న్యూయార్క్ లో ఉంటారు. తరువాత శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. అక్కడి సిలికాన్ వ్యాలీలో నిర్వహించనున్న కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. అంతేగాక గూగుల్ కార్యాలయాన్ని కూడా ప్రధాని సందర్శిస్తారని, భారతీయ సమాజం గురించి ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారని సమాచారం. గతేడాది సెప్టెంబర్ లో తొలిసారి అమెరికాలో పర్యటించిన మోదీ... మళ్లీ ఈ సంవత్సరం అదే నెలలో రెండవసారి పర్యటించబోతుండటం విశేషం.