: మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి చేయందుకోనున్న అసిన్!


'గజినీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి అసిన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. దేశీయ మొబైల్ ఫోన్ తయారీ దిగ్గజం మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో అమ్మడి వివాహం త్వరలోనే జరగనుంది. జీవితంలో మధుర ఘట్టమైన పెళ్లి కోసం అసిన్ తన ఒప్పందాలన్నీ చకచకా పూర్తిచేస్తోందట. వివాహానికి ముందే అన్ని కమిట్ మెంట్లను పూర్తి చేసేయాలని ఈ కేరళ భామ నిర్ణయించుకుందట. అభిషేక్ బచ్చన్ సరసన అసిన్ నటించిన 'ఆల్ ఈజ్ వెల్' త్వరలో విడుదల కానుంది. కాగా, 'మైక్రోమ్యాక్స్' రాహుల్ శర్మను అసిన్ కు పరిచయం చేసింది యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. మైక్రోమ్యాక్స్ కు మొదట్లో అక్షయ్, ట్వింకిల్ ఖన్నా దంపతులు బ్రాండ్ అంబాసడార్లుగా వ్యవహరించారు. అటుపై రాహుల్, అక్షయ్ మధ్య దోస్తీ కుదిరింది కూడా. ఈ క్రమంలోనే అసిన్ ను రాహుల్ కు పరిచయం చేశాడట 'ఖిలాడీ' హీరో. ఆ పరిచయమే అనేక దశలు దాటి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చినట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News