: ఢిల్లీలో వైసీపీ దీక్షకు మద్దతు తెలిపిన సీతారాం ఏచూరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు. దీక్షా వేదికపై జగన్ మాట్లాడుతుండగా జంతర్ మంతర్ వద్దకు ఏచూరి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ దీక్షకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానన్నారు. ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ లో తీవ్రంగా పోరాడతామని చెప్పారు. హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News