: ప్రత్యేక హోదాపై యూపీఏ హామీ ఇచ్చింది... నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది: రాహుల్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునికోటి ఆత్మాహుతికి పాల్పడడంపై పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీ సర్కారుపై ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తరుణం ఇదేనని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఏపీ హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ కార్యకర్త మునికోటి కుటుంబ సభ్యులకు రాహుల్ ఫోన్ చేసి పరామర్శించారు.

  • Loading...

More Telugu News